వైసిపి ప్రభుత్వంలోనే బిసిలకు న్యాయం

ప్రజాశక్తి – కడప
ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలోనే బిసిలకు న్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి. అంజాద్‌ బాషా, ఎంపీ వై.ఎస్‌. అవినాష్‌ రెడ్డి, నగర మేయర్‌ కే సురేష్‌ బాబు, ఎమ్మెల్సీలు రమేష్‌ యాదవ్‌, ఎం రామచంద్రారెడ్డి సంయుక్తంగా పేర్కొన్నారు .గురువారం ఆర్‌ అండ్‌ బి శాఖ ఆధ్వర్యంలో స్థానిక పాత రిమ్స్‌లో నూతనంగా నిర్మించిన బిసి భవన్‌ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మాట్లాడుతూ బిసి భవన్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బిసి భవనం నగరంలో ఉండాలనే ఉద్దేశంతో ఎంపీ పట్టుబట్టి స్థలానికి కేయించారని చెప్పారు. బిసి భవనంలో ఒక గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నాపరు. ఎంపీ మాట్లాడుతూ బిసిల చిరకాల కోరిక అన్నిటికి నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఒకటిన్నర సంవత్సరం కిందట స్థలానికి భూమి పూజ చేసిన నేడు భవనాన్ని ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. ఇంకా కొన్ని చిన్నచిన్న పనులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని కూడా త్వరలో పూర్తి చేసి ఏప్రిల్‌ నెలాఖరులోగా నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ నిత్యానంద రెడ్డి, జడ్‌పి వైస్‌ చైర్మన్‌ బాలయ్య యాదవ్‌, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ మహేశ్వర్‌ రెడ్డి, ఇఇ ప్రభాకర్‌ నాయుడు, డిఇ కళ్యాణి, ఎఇ శ్రీహరి, కార్పొరేటర్లు, నాయకులు బంగారు నాగయ్య యాదవ్‌, ఇతర బిసి కుల సంఘ నాయకులు పాల్గొన్నారు.( ఫోటో:- బీసీ భవన్‌ ను రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభిస్తున్న ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, ఎంపీ అవినాష్‌ రెడ్డి, నగర మేయర్‌ సురేష్‌ బాబు.

➡️