ఎస్.బి.ఐ కుంటి సాకుల వెనక బిజెపి ఒత్తిడి

Mar 11,2024 14:25 #Kadapa
cpm protest against electoral bonds kadapa

సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్
ఎస్.బి.ఐ. బ్రాంచ్ ఎదుట సిపిఎం నిరసన
ప్రజాశక్తి-కడప అర్బన్ : ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఎస్బిఐ ఎన్నికల ముందే అమలు చేయాలని, కుంటి సాకులు వెనుక బిజెపి ఒత్తిడి ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్ అన్నారు. సోమవారం స్థానిక ఏడు రోడ్ల కూడలిలోని ఎస్.బి.ఐ. బ్రాంచ్ కార్యాలయం ఎదుట ఎన్నికల బాండ్ల లావాదేవీలపై ఈ 13 లోపు సుప్రీంకోర్టుకు ఎస్.బి.ఐ. అన్ని బ్రాంచ్ లు తెలియజేయాలని డిమాండ్ చేశారు. బిజెపి ఒత్తిడితో లోక్ సభ ఎన్నికల తర్వాత ఎస్.బి.ఐ. ఎన్నికల బాండ్ల వివరాలు, లావాదేవీలు, పేర్లు, ఇస్తామనడం అహేతుకమైన విషయమని చెప్పారు. సుప్రీంకోర్టు ఎన్నికల ఎలక్ట్రోరల్ బాండ్స్ చట్టాన్ని కొట్టివేస్తూ, 21 రోజు లోపల 2019 నుంచి 2024 వరకు ఎన్నికల బాండ్ల వివరాలు, లావాదేవీలు, ఇచ్చినవారు, పుచ్చుకున్న వారి వివరాలు, సుప్రీంకోర్టుకు ఈనెల 13వ తేదీ లోపు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, బిజెపి ఒత్తిడితో ఎస్.బి.ఐ. నేటి నుంచి మళ్లీ 116 రోజులు గడువు కావాలని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయటం చూస్తుంటే, 2024 ఏప్రిల్ ఎన్నికలు ముందు వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తుందన్నారు. ఎన్నికల బాండ్ల వాస్తవాలు, నిజాలు దేశ ప్రజలకు తెలియజేయకుండా ఆపటానికి బిజెపి కేంద్ర ప్రభుత్వం లోని ఎస్.బి.ఐ. రాజ్యాంగ సంస్థను ప్రభావితం చేస్తున్నట్లుగానూ తేటతెల్లమవుతోందని ఆరోపించారు. ఎస్.బి.ఐ. సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రాథమిక సమాచారంలో 6 వేల 565 కోట్ల విలువచేసే వాళ్లు బిజెపి ఎన్నికల విరాళాలు బాండ్లు ఇచ్చారని, 22 వేల 217 బాండ్లు అన్ని రాజకీయ పార్టీలకు వచ్చినట్లుగా చెప్పారని దీని వివరాలు చెప్పటానికి నాలుగు నెలల కాలం అవసరం లేదని ఎవరికైనా అర్థమవుతుందన్నారు. నాలుగు నెలల కిందట బిజెపికి ఎప్పుడు ఎన్నికల విరాళాలు ఇవ్వని 23 కార్పొరేట్ సంస్థలు రూ.9.05 కోట్లు విరాళాలు ఇచ్చాయని చెప్పారని, వారి పేర్లు వెల్లడించడానికి సమయం కోరడం హాస్యాస్పందంగా ఉందన్నారు. దేశ ఎన్నికల్లో అత్యంత అవినీతి కరమైన బిజెపి ప్రభుత్వం అని ప్రజల ముందు నిరూపణ అవుతుందని బిజెపి కి భయం పుట్టుకునిందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.రామ్మోహన్, బి.మనోహర్, జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాసులు రెడ్డి, బి.దస్తగిరి రెడ్డి, నగర కమిటీ సభ్యులు ఎస్.రాజేంద్ర పాల్గొన్నారు.

➡️