అంకితభావంతో కూడిన సేవలు అవసరం

Feb 25,2024 23:26
రోగుల పట్ల అంకిత భావంతో

ప్రజాశక్తి – గండేపల్లి

రోగుల పట్ల అంకిత భావంతో కూడిన సేవలు అందిం చాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కె.నరసింహ నాయక్‌ అన్నారు. ఆదివారం స్థానిక ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భం గా సిబ్బంది హాజరు, ఒపి సేవలు, లేబర్‌ రూమ్‌, ఆపరేషన్‌ థియేటర్‌, లాబరేటరీ, నర్సింగ్‌ స్టేషన్‌, ఫార్మసీ సేవలు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశౄరు. రోగులకు అంకితభావంతో సేవలు అందించాలన్నారు. ఆరోగ్య కంద్రం నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ బి.సురేంద్ర, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ శర్మ, సిబ్బంది రూతమ్మ, చల్లారావు, ఈశ్వరమ్మ, హిమవతి, సౌజన్య, నాగార్జున, దేవి, ఉపేంద్రరాజు పాల్గొన్నారు.

➡️