అభివృద్ధి పనులకు ఆమోదం

Jan 29,2024 22:11
అన్నవరం వీర వెంకట

ప్రజాశక్తి – అన్నవరం

అన్నవరం వీర వెంకట సత్యనారా యణ స్వామి దేవ స్థానంలో పలు అభివృద్ధి పనులకు పాలక మండలి ఆమోదిం చింది. సోమవారం జరిగిన ట్రస్ట్‌ బోర్డు సమావేశానికి చైర్మన్‌ రాజా ఐవి రోహిత్‌ అధ్యక్షత వహించారు. దేవస్థానం ఇఒ కె.రామచంద్రమోహన్‌ పాలన, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన 19 అంశాలను సభ్యుల ఆమోదం కోసం ప్రవేశపెట్టారు. టోల్‌ గేట్‌ వద్ద నుంచి సెంటినరీ కాటేజ్‌ వరకు నూతన మెట్ల మార్గం పనులకు రూ.85 నుంచి రూ.90 లక్షలు పెంపునకు ఆమోదించారు. పాత టోల్గేట్‌ నుంచి సచ్చగిరి కొండ వరకూ రహదారిపై బిటి రోడ్డు వేయాలని ఆమోదించారు. కొండ దిగువ సత్య నికేతన్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నందు 13వ నెంబరు షాపునకు ఇటీవల నిర్వహించిన బహిరంగ వేలంలో హెచ్చు పాట అంశాన్ని, దేవస్థానం నిత్య అన్నదాన పథకం సంబంధించి డిసెంబర్‌ నెల ఆదాయ వ్యయం సంబంధించిన అంశాన్ని ఆమోదించారు ఈ సమావేశంలో దేవస్థానం ఎసి రమేష్‌బాబు, ఇంజనీరింగ్‌ మరియు ఎలక్ట్రికల్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️