ఎన్నికల నిబంధనలపై సమగ్రమైన అవగాహన

Feb 26,2024 23:00
ఎన్నికల నిబంధనలపై

ప్రజాశక్తి – కాకినాడ

ఎన్నికలు మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌పై సమగ్రమైన అవగాహన తెచ్చుకుని విధుల నిర్వ హణలో సక్రమంగా అమలు చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయం 2024 అసెంబ్లీ, పార్లమెంట్‌ సాధారణ ఎన్నికలలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ అమలుపై ఎంసిసి, వ్యయం పరిశీలకులు, విఎస్‌టి, వివిటి, ఎఫ్‌ఎస్‌టి, ఎస్‌ఎస్‌టి బృందాలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ శిక్షణకు హజరైన వివిధ బృందాలకు చెందిన అధికారులు ఎన్నికల్లో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమలులో ముఖ్యపాత్ర పోషించాల్సి వుంటుందన్నారు. ఎన్నికల కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ను నిష్పక్షపాతంగా అమలు చేయాలని సూచించారు. ఏ పరిస్థితుల్లో ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఇసిఐ ఎన్నికల మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండాక్ట్‌లో తెలియ జేయడం జరిగిందని వివరించారు. ప్రతి దానిని నిష్పక్షపాతంగా అమలు చేయవలసి ఉందని తెలి పారు. ఎంసిసి అమలుపై ప్రతిరోజు నివేదికలు అందించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి సివిజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చనని చెప్పారు. ఫిర్యాదు వచ్చిన 24 గంటల లోపల ఆర్‌ఒ ఫిర్యాదులకు నివేదికలు ఇసిఐకి అందచేయాలని సూచించారు. కొన్ని బృందాలు ఇఎస్‌ఎంఎస్‌ ద్వారా మాత్రమే రిపోర్టులు, నివేదికలు పంపించాలని సూచించారు. గతంలో రిపోర్టులు మాన్యువల్‌గా పంపించేవారని ప్రస్తుతం మాన్యు వల్‌గా ఆదేశాలు ఇవ్వడంగానీ రిపోర్టులు పంపించ డంగాని అన్ని ఇఎన్‌ఎంఎస్‌ ద్వారా జరుగుతాయని చెప్పారు. ప్రతి ఎన్నికల అధికారికి ఇఎస్‌ఎంఎస్‌ నిర్వ హణకు ఒక లాగిన్‌ ఇవ్వడం జరుగుతుందని, ఆ లాగిన్‌ ద్వారానే ఆదేశాలు వస్తాయని నివేదికలు కూడా పంపించాల్సివుంటుందని తెలిపారు. గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా ఇఎస్‌ఎంఎస్‌ను డౌన్లోడ్‌ చేసుకుని అధికారి హోదా, మొబైల్‌ నెంబర్‌ తదితర వివరాలను నమోదు చేసి లాగిన్‌ను ప్రారంభించాలని కలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంసిసి నోడల్‌ అధి కారి, డిపిఒ భారతి సౌజన్య, ఐటీ నోడల్‌ అధికారులు ఎన్‌ఐసిడిఐఒ సుబ్బారావు, ట్రైనింగ్‌ నోడల్‌ అధికారి, కాకినాడ డిఎల్‌డిఒ నారాయణమూర్తి, పెద్దాపురం డిఎల్‌డిఒ ప్రసాదరావు, ఎంసిసి టిమ్‌ సభ్యులు, ఎన్నికల వ్యయం పరిశీలకులు, ఎఫ్‌ఎస్‌టి, ఎస్‌ఎస్‌టి బృందం సభ్యులు పాల్గొన్నారు.

➡️