ఎన్నికల బాండ్ల వివరాలు ప్రకటించాలి

Mar 11,2024 23:32
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

ప్రజాశక్తి – యంత్రాంగం

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా యాజమాన్యం సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించి ఎన్నికల బాండ్ల వివరాలు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తక్షణమే ఇవ్వాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు లోభాగంగా సోమవారం జిల్లాలోని పలు ప్రాంతా ల్లో ఎస్‌బిఐ బ్రాంచ్‌ల వద్ద ధర్నాలు జరిగాయి.

కాకినాడ స్థానిక మెయిన్‌ రోడ్‌లోని ఎస్‌బిఐ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయ కుడు దువ్వా శేషబాబ్జీ మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ సంస్థలు, స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను నిర్వీర్యం చేయ బడుతున్నాయని విమర్శించారు. ఎస్‌బిఐ జారీ చేసిన ఎన్నికల బాండ్లు విషయంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మార్చి 6లోపు వివరాలు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. జూన్‌ 30 వరకు 116 రోజులు గడువు కావాలని ఎస్‌బిఐ యాజమాన్యం సుప్రీంకోర్టును కోరడం హాస్యాస్పదంగా ఉంద న్నారు. ఎస్‌బిఐ యాజమాన్యం కోర్టు ధిక్కరణకు పాల్పడుతుందన్నారు. తక్షణమే సుప్రీం కోర్టు ఆదే శాలను గౌరవిస్తూ ఎస్‌బిఐ ఎన్నికల బాండ్ల వివ రాలు ప్రకటించాలని, లేనిపక్షంలో ఆందోళన తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. సిపిఎం నగర కన్వీనర్‌ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు కె.సత్తిరాజు మాట్లాడుతూ కార్పొరేట్‌ కంపెనీలకు సేవచేయడానికి బిజెపి పాలకులు అధికారికంగా తీసుకున్న ముడుపులే ఎన్నికల బాండ్లని విమర్శించారు. బాండ్లు ఎవరు కొన్నారు, అవి ఏ పార్టీకి చేరాయో ప్రకటించాలని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యుడు మలక వెంకటరమణ, పాలిక రాజేంద్రప్రసాద్‌, రాజశేఖర్‌, టి.వీరబాబు, ఎం.రవి, నాగేశ్వరరావు, పాల్గొన్నారు.

కాకినాడ రూరల్‌ మండలంలోని ఎస్‌.అచ్చుతాపురం ఎస్‌బిఐ వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కన్వీనర్‌ తిరుమలశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్నికల బాండ్ల ద్వారా కోట్లాది రూపాయలు నిధులు వస్తే అందులో 95 శాతం నిధులు బిజెపి పార్టీకే వచ్చాయన్నారు. బిజెపి పార్టీ అందుకున్న రూ.6,565 కోట్లు విలువ చేసే బాండ్లు వివరాలు బయటకు వస్తే ఏ పెట్టుబడుదారుడు లేదా కంపెనీ ఆ బాండ్లను విరాళంగా ఇచ్చిందో తెలుస్తుందని అన్నారు. ఆ కంపెనీలకు మోడీ చేసిన రుణమాఫీలు, సహాయాలు కూడా బయటికి వస్తాయని అన్నారు. ఇడి, ఐటి వంటి సంస్థలను ఉపయోగించి రాజకీయంగా, ఆర్థికంగా ఇతరు లను ఇబ్బంది పెడుతుందన్నారు. దేశవ్యాప్తంగా శాంతియుతంగా చేస్తున్న నిరసనలు భవిష్యత్తులో పెద్ద ఉద్యమంగా మారుతుందన్నారు. ఈ కార్య క్రమంలో రూరల్‌ కమిటీ నాయకులు చిట్టూరి విజరుకుమార్‌, పెద్దింశెట్టి రామకృష్ణ, మేడిశెట్టి వెంకటరమణ, తొట్టపూడి రాజా, వాసంశెట్టి చంద ర్రావు, అంకం సుబ్రహ్మణ్యం, శ్రీను, లక్ష్మీ, సత్య, నాగలక్ష్మి పాల్గొ న్నారు.

పెద్దాపురం స్థానిక ఎస్‌బిఐ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిరపరపు శ్రీనివాస్‌ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వ ఒత్తిడి మేరకే ఎస్‌బిఐ బాండ్ల వివరాలు వెల్లడించడానికి జాప్యం చేస్తుందన్నారు. కార్పొరేట్‌ శక్తుల నుంచి ఎన్నికల బాండ్ల పేరుతో బిజెపి సేకరించిన సొమ్ము వివరాలు ఎన్నికలు ముగిసే అంతవరకు తెలియకుండా ఉండ డానికే ఈ నాటకాలు ఆడుతుందన్నారు. ఇటువంటి బాండ్ల సేకరణ కొన సాగితే కార్పొరేట్‌ శక్తుల కనుసన్నలలో ప్రభుత్వాలు పాలన సాగిస్తా యన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దారపురెడ్డి సత్య నారాయణ, రొంగల వీర్రాజు, కూనిరెడ్డి అప్పన్న, నెక్కల నరసింహ మూర్తి, ఆర్‌.అరుణ్‌, క్రాంతికుమార్‌, జగదీష్‌, శివ, చింతల సత్య నారాయణ, చల్లా విశ్వనాథం పాల్గొ న్నారు.

సామర్లకోట స్థానిక మెయిన్‌ రోడ్డులోని ఎస్‌బిఐ బ్రాంచ్‌ వద్ద సిపిఎం పట్టణ కమిటీ నిరసన వ్యక్తం చేసింది. అనంతరం బ్యాంకు అధికారులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని నాయకులు అందించారు. ఈ కార్య క్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కరణం ప్రసాదరావు మాట్లాడుతూ ఇది బ్యాంక్‌, ప్రభుత్వం వ్యవహారం కాదని.. దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణకు సంబంధించిన విషమయన్నారు. ఈ నిరసన కార్య క్రమంలో సిపిఎ శాఖ కార్యదర్శి బాలం శ్రీనివాస్‌, విప్పర్తి కొండలరావు, కోనా శివకుమార్‌, తుంపాల శ్రీను, కరణం ఏడుకొండలు,పాల్గొన్నారు.

➡️