ఐక్యత పోరాటాలతోనే హక్కుల సాధన

Mar 13,2024 23:33
కార్మికుల ఐక్య పోరా టాల

ప్రజాశక్తి – కాకినాడ

కార్మికుల ఐక్య పోరా టాల ద్వారానే హక్కుల సాధన సాధ్యం అవుతుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి అన్నారు. బుధవారం స్థానిక జిజిహెచ్‌ ప్రాంగణంలో సిహెచ్‌. విజరు కుమార్‌ అధ్యక్షతన జరిగిన శానిటేషన్‌ వర్కర్స్‌ జన రల్‌ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిజిహెచ్‌ శానిటేషన్‌ వర్కర్స్‌ నిర్వహించిన పోరాటం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. అయితే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, అందుకు తగిన విధంగా కార్మికుల వేతనాలు పెరగడం లేదన్నారు. పాలకుల హామీ ప్రకారం కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులు అందరినీ నిర్ధిష్ట సమయంలో పర్మినెంట్‌ చేయాలని సిఐటియు డిమాండ్‌ చేస్తోందన్నారు. ప్రస్తుత పోరాటం అనుభవాలతో, సంఘటితమై భవిష్యత్తులో మరిన్ని హక్కులు సాధించుకోవాలని పిలుపు నిచ్చారు. సిఐటియు నగర నాయకులు పలివెల వీరబాబు, మలక వెంకటరమణ మాట్లా డుతూ జిజిహెచ్‌ శానిటేషన్‌ వర్కర్స్‌ ఉద్యమానికి సంఘీ భావం తెలిపి, అండగా నిలబడ ిన సంఘాలు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో యూనియన్‌ నాయకులు జె.శేషు, ఎస్‌. వాసు, జె.లక్ష్మీప్రియ, కృష్ణవేణి, మంగ తాయారు, కుమారి, శ్రీకాంత్‌, ఏసు, దుర్గా ప్రసాద్‌, వివిఎన్‌కుమార్‌ పాల్గొన్నారు.

➡️