ఘనంగా రన్‌ ఫర్‌ జీసస్‌

Mar 30,2024 16:51
మండల పాస్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో

ప్రజాశక్తి – సామర్లకోట, పెద్దాపురం

మండల పాస్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రన్‌ ఫర్‌ జీసస్‌ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ నిర్వహించిన కార్యక్రమంలో వేలాదిగా క్రైస్తవులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని వైసిపి పెద్దాపురం నియోజకవర్గ అభ్యర్థి దవులూరి దొరబాబు, వైసిపి నాయకుడు దవులూరి సుబ్బారావు, మండల పాస్టర్ల అసోసియేషన్‌ అధ్యక్షులు రెవ. డాక్టర్‌ ఎం.సాల్మన్‌ రాజు, కార్యదర్శి రెవ. డాక్టర్‌ వి.జాన్‌, కోశాధికారి రెవ.ఆర్‌.లాజరస్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఊబా జాన్‌ మోజేష్‌, క్రిస్టియన్‌ మైనార్టీ సంఘ రాష్ట్ర నాయకులు మడికి మేరీ సోనియా, ఎం.జానీ మోజెస్‌, కో అప్సన్‌ సభ్యులు సల్లూరి కళ్యాణ్‌, కౌన్సిలర్లు పిట్టా సత్యనారాయణ, పాలికి కుసుమ చంటిబాబు, మండల పాస్టర్ల అసోసియేషన్‌ నాయకులు పాల్గొన్నారు. అలాగే పెద్దాపురంలో రన్‌ ఫర్‌ జీసస్‌ కార్యక్రమం జరిగింది. స్థానిక లూథరన్‌ హైస్కూల్‌ వద్ద ఈ ర్యాలీని కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ లంక పురుషోత్తమ దాస్‌, డాక్టర్‌ విజయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డి.వెంకటపాల్‌, బి.విద్యాసాగర్‌, తలారి విజరుకుమార్‌, పరంజ్యోతి, ప్రతిభా స్కూల్స్‌ చైర్మన్‌ ఎస్‌వివి.ప్రకాష్‌ పాల్గొన్నారు.

➡️