జయహో బిసి సభ జయప్రదానికి కృషి

Feb 21,2024 23:17
ఈ నెల 25న పెద్దాపురంలో

ప్రజాశక్తి – జగ్గంపేట

ఈ నెల 25న పెద్దాపురంలో జరిగే జయ హో బిసి సభను విజయ వంతం చేయా లని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ పిలుపు నిచ్చారు. బుధవారం మండలం లోని ఇర్రిపాకలో నియోజ కవర్గ టిడిపి సమన్వయ కమిటి సమా వేశం జరి గింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి అంటేనే బీసీల పార్టీ అని, టిడిపి పాలనలోనే బిసిలకు తగిన రాజకీయ గుర్తింపు వచ్చిందన్నారు. ఫిబ్రవరి 25న పెద్దాపురం నియోజకవర్గంలో కాకినాడ పార్లమెంట్‌ తెలుగుదేశం పార్టీ జయహో బిసి సభ జరుగుతుందని తెలిపారు. ఈ సమాy ేశానికి కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన ఇన్‌ఛార్జ్‌లు, బిసి నాయకులు పాల్గొంటారని చెప్పారు. ఈ సభలో నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన ముఖ్య నాయకులు, బిసిలు పెద్దఎత్తున పాల్గొనేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 26 నుంచి మార్చి 7 వరకూ ఇర్రిపాకలో కోటి పార్థివలింగ మహా రుద్రాభిషేకం జరుగనుందనీ, తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎస్‌విఎస్‌.అప్పలరాజు, అడబాల వెంకటేశ్వ రరావు, జీను మణిబాబు, జాస్తి వసంత్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️