సీజ్‌ చేసిన మద్యం ధ్వంసం

Jun 27,2024 22:30
నుంచి స్వాధీనం చేసుకున్న

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌

మద్యాన్ని అనధికారికంగా తరలించే వారి నుంచి స్వాధీనం చేసుకున్న మద్యాన్ని సెబ్‌, పోలీసు అధికారుల సమక్షంలో ధ్వంసం చేశారు. గురువారం రూరల్‌ మండలం సూర్యారావు పేట గ్రామం ఎన్‌టిఆర్‌ బీచ్‌ ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం రోడ్డులో ఎన్నికల కోడ్‌ సమ యంలో స్వాధీనం చేసుకున్న మద్యంతో పాటు, గత రెండేళ్ల కాలంలో వివిధ కేసుల్లో పట్టుబడిన స్వాధీనం చేసుకున్న మద్యాన్ని రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వం సం చేశారు. జిల్లా ఎస్‌పి ఎస్‌.సతీష్‌ కుమార్‌, సెబ్‌ ఎఎస్‌పి శ్రీలక్ష్మి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్బంగా ఎస్‌పి సతీష్‌కుమార్‌ మా ట్లాడుతూ గత రెండేళ్లలో జిల్లాలో ఐడిపిల్‌, డిపిఎల్‌, ఎన్‌డిపిఎల్‌ కేసులకు సంబంధించి 1406 అక్రమ మద్యం తరలింపు కేసులు నమోదు చేసి, 94 వేల 737 మద్యం బాటిళ్లకు సంబంధించి సుమారు 33 వేల లీటర్లను సీజ్‌ చేసినట్లు తెలిపారు. 12 వేల 533 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. పట్టుబడిన మద్యం విలువ రూ.1 కోటి 65 లక్షల 69వేల రూపాయలు ఉంటుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో సెబ్‌ సూపరింటెండెంట్‌ జె.రవికుమార్‌, అసిస్టెంట్‌ సెబ్‌ సూపరిం టెండెంట్‌ ఎ. శ్రీరంగందొర, జిల్లాకు చెందిన సెబ్‌, పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️