ఉపాధి బకాయి వేతనాలు చెల్లించాలి

Jun 27,2024 22:29
బకాయి వేతనాలను తక్షణమే

ప్రజాశక్తి – తాళ్లరేవు

ఉపాధి హామీ పనులకు సంబంధించిన బకాయి వేతనాలను తక్షణమే కూలీలకు చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు డిమాండ్‌ చేశారు. గురువారం పటవల గ్రామ పంచాయతీ వద్ద ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామసభ జరిగింది. ఈ సందర్భంగా సామాజిక తనిఖీ ప్రత్యేక అధికారి, ఎంఇఒ ఎ.మంగాయమ్మ, పంచాయతీ కార్యదర్శి రమణమ్మలకు కూలీలతో కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ చట్ట ప్రకారం రాజీలేని అంశాలను కచ్చితంగా అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందన్నారు. పనిచేసిన 15 రోజులకు వేతనాలు తప్పనిసరిగా ఇవ్వాలని, తాగునీరు, మెడికల్‌ కిట్లు తప్పనిసరిగా పని ప్రదేశంలో కల్పించాలన్నారు. వేతనం రూ.300 ఇవ్వాల్సివుందన్నారు. అయితే ఇవేమి అమలు కావడం లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉపాధి కూలీలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మందనక్క తణుకురాజు, దోణం సునీత, పులపకూర కష్ణ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు

➡️