ఎంఎల్‌ఎ నానాజీని కలిసిన సిఐటియు నేతలు

Jun 27,2024 22:29
ఎంఎల్‌ ఎ పంతం నానాజీని సిఐటియు

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌

కాకినాడ రూరల్‌ నియోజకవర్గ ఎంఎల్‌ ఎ పంతం నానాజీని సిఐటియు అఖిల భారత ఉపా ధ్యక్షులు జి.బేబిరాణి ఆధ్వర్యంలో సిఐటియు బృందం గురువారం ఆయన నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బేబిరాణి మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యో గులు, అంగన్‌వాడీ, ఆశా, విఒఎ, మధ్యాహ్న భోజన పథకం వంటి స్కీం వర్కర్స్‌ వేతనాలు, పదోన్నతులు, ఉద్యోగ భద్రత వంటి అంశాలను ఆయన దృష్టికి తీసు కెళ్లారు. ఎంఎల్‌ఎ నానాజీ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో సిఐటియు అధ్యక్ష, కార్య దర్శులు దువ్వా శేషబాబ్జీ, చెక్కల రాజ్‌కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షులు కె.సత్తిరాజు, జిల్లా కోశాధికారి మలక వెంకటరమణ, నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు, రూరల్‌ సిఐటియు నాయకులు ఎం.వెంకటరమణ, టి.రాజా, మధ్యాహ్న భోజన పథకం నాయకురాలు ఈశ్వరి, అంగన్‌వాడీ నాయకులు రమణమ్మ, వీరమణి, వరలక్ష్మి, వీరవేణి, ఆశా యూనియన్‌ నాయకులు బేబి, విమల, స్వర్ణ సుజాత పాల్గొన్నారు.

➡️