నిధుల్లేక ఆగిన పింఛన్ల పంపిణీ

Apr 1,2024 23:29
సచివాలయ సిబ్బంది, గ్రామ

ప్రజాశక్తి – కరప

సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో ఫించన్లు పంపిణీ చేయించకపోవడానికి నిధు లు కొరతే కారణమని, ఎన్నికల కమి షన్‌, టిడిపి కాదని మాజీ ఎంఎల్‌ఎ కాకినాడ రూరల్‌ పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, జనసేన పార్టీ రూరల్‌ నియోజకవర్గ అభ్యర్థి పంతం నానాజీ అన్నారు. సోమవారం యండ మూరు గ్రామంలో వారు ఇంటింటికీ తిరిగి పింఛన్‌దారులతో మాట్లాడారు. జగన్‌ రెడ్డి స్వార్ధ రాజకీయం వల్లే పింఛన్‌దారులు, వాలంటీర్లు నష్టపోతున్నా రన్నారు. పింఛన్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులు ఎన్నికల కోడ్‌కు విరు ద్ధంగా సొంత కాంట్రాక్టర్లకు జగన్‌ దోచి పెట్టాడని ఆరోపించారు. ఖజానాలో నిధు లు లేకనే పింఛన్ల పంపిణీ చేయలేదని, ఏప్రియల్‌ 1న నుంచే ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని జగన్‌ రెడ్డి ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదని ప్రశ్నించారు. ఒకటో తేదీన పెన్షన్లకు ఇవ్వాల్సిన రూ.13వేల కోట్లను మార్చి 16 నుంచి 30వ తేదీలోపే తన అనుకూల కాంట్రాక్టర్లకు ఈ మొత్తాన్ని మళ్లించారని విమర్శంచారు. తన చేతగానితనాన్ని జగన్‌ ఎన్నికల కమిషన్‌పైనా, టిడిప ిపైనా నెట్టుతున్నారని దుయ్యబట్టారు. కూటమి అధికారంలోకి రాగానే ఇంటి వద్దకే నెలకు రూ. 4,000 పింఛన్‌ అంది స్తామని అన్నారు. వాలంటీర్లను ప్రజా సేవకులుగా కాకుండా తన పార్టీ కార్య కర్తల్లా వినియోగించడం వల్లే ఎన్నికల కమిషన్‌ వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా పెట్టిందన్నారు. ఈ కార్య క్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు, బి.కొండబాబు, బి.గంగాధర్‌, పి.జానకిరామయ్య, ఎం.శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️