పార్టీ మారడం లేదు : యనమల కృష్ణుడు

Mar 15,2024 23:07
పార్టీ మారడం లేదు : యనమల కృష్ణుడు

ప్రజాశక్తి-కోటనందూరుతాను పార్టీ మారుతున్నట్లు కొన్ని ఛానల్స్‌లో వచ్చిన వార్తలను టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి యనమల కృష్ణుడు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం తుని పట్టణంలో తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీల 1982 ఆవిర్భావం నుండి తెలుగు యనమల రామకష్ణుడు ,నేను కలిసే పని చేసే మని అన్నారు . ఎన్టీ రామారావు ,చంద్రబాబు నాయుడు పాలనలో క్రమశిక్షణ గల నాయకులుగా ఇప్పుడు వరకు పనిచేయడం జరిగిందని అన్నారు. 2009లో రామకృష్ణుడు ఓడిపోయిన తర్వాత, అప్పటి రాజకీయ పరిస్థితుల వల్ల 2014,2019 సంవత్సరాల్లో తుని టిడిపి అభ్యర్థిగా నేను పోటీ చేసి వరుసగా రెండుసార్లు ఓడిపోవడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో రామకష్ణుడు రాజకీయ వారసురాలుగా తుని నియోజకవర్గంలో దింపడం వల్ల తన పెద్ద కుమార్తె యనమల దివ్యను బరిలో దించడం జరిగిందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టిడిపిని వీడే ప్రసక్లేదని అన్నారు. పదవులు లేకపోయినా ఎమ్మెల్యే, మంత్రులు, చేసిన పరిపాలన నేను తునిలో ప్రజలకు మంచి చేశానని గుర్తు చేశారు. మీడియా విజ్ఞతతో వ్యవహరించాలని కోరారు.

➡️