ప్రజలను మోసం చేసిన చంద్రబాబు

Feb 17,2024 22:24
ప్రజలను నమ్మించి మోసం

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌

ప్రజలను నమ్మించి మోసం చేసిన వ్యక్తి మాజీ సిఎం చంద్రబాబు నాయుడు అని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శంచారు. ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు స్వగృహాంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రైతులను నమ్మించి మోసం పేర్కొన్నారు. వరదల సమయంలో తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను అవహేళన చేశారని ధ్వజమెత్తారు. నేటి ప్రభుత్వ పాలనలో దళారుల ప్రమేయం లేకుండా రైతుల నుంచి ఆర్‌బికెల ద్వారా నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. ఈ విధానం ద్వారా రైతు పండించిన పంటకు మద్దతు ధర దక్కుతుందని తెలిపారు. చంద్రబాబు బిసిలను పట్టించుకోకుండా ఏకపక్ష ధోరణితో పాలన చేస్తే ప్రస్తుత సిఎం జగన్‌ బిసిలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ఈ సమావేశంలో రూరల్‌ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కురసాల సత్యనారాయణ, జడ్‌పిటిసిలు నురుకుర్తి రామకృష్ణ, యాళ్ళ సుబ్బారావు, ఎంపిపిలు గోపిశెట్టి పద్మజ, పెంకే శ్రీలక్ష్మీ, మాల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జంగా గగారిన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️