బకాయిల విడుదల కోసం ఆందోళన

Feb 17,2024 22:25
ప్రభుత్వ ఉద్యోగులు,

ప్రజాశక్తి – జగ్గంపేట

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యా యులు, పెన్షనర్లకు రావలసిన డిఎ బకా యిలు వెంటనే చెల్లించాలని ఐక్య కార్యచరణ సమితి జగ్గంపేట యూనియన్‌ చైర్మన్‌ వివివి.కృష్ణ డిమాండ్‌ చేశారు. స్థానిక తహ శీల్దార్‌ కార్యాలయం వద్ద జెఎసి ఆధ్వర్యంలో శనివారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల, ఉపాధ్యా యుల, పెన్షనర్లకు న్యాయబద్ధంగా రావలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.ఉద్యోగస్తులు దాచుకున్న జిపి, జడ్‌పి జిపిఎఫ్‌, 4వ తరగతి ఉద్యోగుల జిపిఎఫ్‌లు కూడా చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. 2022 పిఆర్‌సి ప్రకారం ఉద్యోగస్తులకు రూ.7500 కోట్లను వెంటనే చెల్లించాలని ప్రభుత్వా నికి డిమాండ్‌ చేశారు. ప్రతీ నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని కోరారు. ఉద్యోగస్తుల సమస్యలపై ప్రభుత్వం స్పందించని పక్షంలో ఈ నెల 20వ తేదీన జరగబోయే మహాధర్నా, 27వ తేదీన చలో విజయవాడను నిర్వహించడం ఖాయమన్నారు. ఆయా ఆందోళనా కారక్రమాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయం నుంచి పంచాయతీ కార్యాలయం వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు సిహెచ్‌.వెంకటేశ్వరరావు, పి.ప్రభాకర్‌, ఎం.సునీల్‌వర్మ, సిహెచ్‌.ప్రసన్నకుమార్‌, ఎ.చల్లా రావు, కె.రాజరత్నం, చంద్రమౌళి వెంకట శాస్త్రి, తోలేటి సూర్యనారాయణ, ఎం సూర్యనారాయణ, ఏం. సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️