బాల్య వివాహాలపై అవగాహన అవసరం

Feb 15,2024 17:27
బాల్య వివాహాలు చేయడం

ప్రజాశక్తి – పిఠాపురం

బాల్య వివాహాలు చేయడం వల్ల జరిగే అనర్ధాలపై అవగాహన పెంచుకుని వాటిని అరికట్టాలని జిల్లా బాలల పరిరక్షణ అధికారి వెంకటరావు అన్నారు. గురువారం పట్టణంలోని స్థానిక మహిళ మండల మహిళా సమైక్య భవనంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ యువతులకు 18 సంవత్సరాలు, యువకులకు 21సంవత్సరాల వివాహ వయస్సు అని తెలిపారు. ఈ వయసులోపు వివాహ చేస్తే దాన్ని బాల్య వివాహం కింద పరిగణించవచ్చన్నారు. ఇటువంటి వివాహాలు జరగడం ద్వారా ముఖ్యంగా ఆడపిల్లలు శారీరకంగానూ, మానసికంగానూ ఆర్థికంగానూ అనేక సమస్యలు ఎదుర్కొంటారన్నారు. బాల్య వివాహం వల్ల బాలికలు గర్భం దాల్చే సన్నద్దత లేకపోవడంతో పుట్టబోయే బిడ్డకు తల్లికి ప్రాణహాని ఉందన్నారు. వివాహాల మూడు దశలో నిలుపుదల చేయవచ్చునని, పెళ్ళి చూపులు, పెళ్ళి సమయంలో, వివాహమైన రెండు సంవత్సరాలలోపు నిలుపుదల చేయవచ్చున్నారు. అలా నిలుపుదల చేయాలనుకుంటే 1098 లేదా 100కి ఫోన్‌ చేయాలన్నారు. పిల్లలు లేని వారికి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా నిర్వహిస్తున్న దత్తత ఏజెన్సీ కోసం వివరించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఒ నిహారిక, డిఆర్‌డిఎ ఎపిఎం షాకినా ప్రియదర్శిని, విజయ, ఐసిడిఎస్‌ ప్రాజెక్టు సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

➡️