ముందస్తు అనుమతి తప్పనిసరి : కలెక్టర్‌

Mar 23,2024 23:25
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన

ప్రజాశక్తి – కాకినాడ

సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించి ప్రసార మాధ్యమాల్లో ప్రసారమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం మార్గ దర్శకాలు అనుసరించి జిల్లాస్థాయి మీడియా సర్టి ఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేయ డం జరిగిందని తెలిపారు. ఈ కమిటీ ఎలక్ట్రానిక్‌ మీడి యాలో రాజకీయ ప్రచార ప్రకటనలకు ముం దస్తు అనుమతి ఇవ్వడంతోపాటు, చెల్లింపు వార్తలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని, మీడియా ఉల్లంఘనలు కూడా గుర్తించి తగిన చర్యలు తీసుకుం టుందన్నారు. రిజిస్టర్‌ కాబడిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలు గానీ వారి తరఫున ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు ఎలక్ట్రానిక్‌ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకట నలకు అనుమతి పొందుట కోసం నిర్ణీత నమూనాలో ప్రకటన ప్రసారం చేయుటకు 3 రోజులు ముందుగా జిల్లాస్థాయి మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీకి ధరకాస్తు చేసుకోవాలని తెలిపారు. రిజిస్టర్‌ కానటువంటి రాజకీయ పార్టీలు, ఇతర వ్యక్తులు వారి ప్రకటన ప్రసారం చేయుటకు 7 రోజులు ముందుగా జిల్లాస్థాయి మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు అందిన రెండు రోజుల్లోగా జిల్లాస్థాయి ఎంసిఎంసి కమిటీ అనుమతి మంజూరు చేస్తుందని వెల్లడించారు. వార్తాపత్రికల్లో పోలింగ్‌ రోజు, పోలింగ్‌ ముందు రోజు ప్రచురించాల్సి ప్రక టనలకు తప్ప నిసరిగా ఎంసిఎంసి నుంచి అను మతి పొంది ప్రకట నలు మాత్రమే ప్రచురించాల ని తెలిపారు. ఎలక్ట్రానిక్‌ మీడి యా పరిధిలోకి అన్ని రకాల టెలివిజన్‌ ఛానళ్లు, కేబుల్‌ నెట్‌వర్కులు, డిజిటల్‌ డిస్ప్లేలు, మొ బైల్‌ నెట్‌వర్క్‌ల ద్వారా ఎస్‌ఎంఎస్‌, వాయిస్‌ మెసేజ్‌ లు వస్తాయని, అలాగే సామాజిక మాధ్యమాలైన (సోషల్‌ మీడియా) ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌, ఇంస్టా గ్రామ్‌, వాట్సాప్‌, గూగుల్‌ వెబ్సై ట్లు, వికిపిడియా కూడా ఎలక్ట్రానిక్‌ మీడియా పరిధి లోకి వస్తాయని తెలిపారు. అలాగే సినిమా హాళ్ల లోనూ, ప్రయివేట్‌ ఎఫ్‌ఎం రేడియోలలో, ఎలక్ట్రానిక్‌ పత్రికలలోను, ప్రసారమయ్యే, ప్రచురిత మయ్యే రాజ కీయ ప్రచార ప్రకటనలు కూడా తప్ప నిసరిగా ముం దస్తు ధ్రువీకరణ పొందాల్సి ఉంటుం దన్నారు. అను మతి పొందిన ఆర్డర్‌ నంబర్‌ను సంబంధిత ప్రక టనపై సూచించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని అన్ని ప్రసారమాధ్యమాలు గమనించాలని సూచిం చారు. ఎంసిఎంసి అనుమతి లేకుండా చేసే ప్రసా రాలు, ప్రకటనలు ఎన్నికల ప్రవర్తనా నియ మావళి ఉల్లంఘనలుగా పరిగణించి, భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

➡️