రాష్ట్రాభివృద్ధిలో కార్యకర్తల భాగస్వామ్యం అవసరం

Feb 17,2024 22:26
రాష్ట్రభివృద్ధిలో ప్రతీ కార్యకర్త

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌

రాష్ట్రభివృద్ధిలో ప్రతీ కార్యకర్త యొక్క భాగస్వామ్యం అవసరమని ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జ్‌ చలమలశెట్టి సునీల్‌ అన్నారు. శనివారం ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ శ్రేణుల పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ కన్నబాబు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్ధితుల్లో కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గానికి తగిన వ్యక్తిని సిఎం నియమించారని అన్నారు. మొదటి దశగా కాకినాడ పార్లమెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సునీల్‌ పర్యటించి పార్టీ శ్రేణులను పరిచయం చేసుకోవడం జరుగుతుందని అన్నారు. చలమలశెట్టి సునీల్‌ మాట్లాడుతూ సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఆశీస్సులతో కాకినాడ పార్లమెంట్‌ అభ్యర్ధిగా తనను నియమించడం జరిగిందన్నారు. వైసిపి పార్టీలో చేరడం తనకు ఆనందంగా ఉంద న్నారు. ఇకపై జగన్‌ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తానని అన్నారు. మరోసారి సిఎంగా జగన్‌ని గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కురసాల సత్యనారాయణ, ప్రముఖ సినీ దర్శకులు కురసాల కల్యాణ్‌కృష్ణ, జడ్‌పిటిసిలు నురుకుర్తి రామకృష్ణ, యాళ్ళ సుబ్బారావు, ఎంపిపిలు గోపిశెట్టి పద్మజ, పెంకే శ్రీలక్ష్మీ, వైస్‌ ఎంపిపిలు బందిలి విరీషా, గుత్తుల సత్తిబాబు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

➡️