సత్యప్రభకు వ్యతిరేకంగా నిరసన

Mar 3,2024 23:18
ప్రత్తిపాడు నియోజక వర్గ టిడిపి

ప్రజాశక్తి – ఏలేశ్వరం

ప్రత్తిపాడు నియోజక వర్గ టిడిపి ఇన్‌ఛార్జ్‌ వరుపుల సత్యప్రభకు వ్యతిరేకంగా టిడిపి జిల్లా అధికార ప్రతినిధి పైల సుభాష్‌ చంద్రబోస్‌ ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు నిరసనకు దిగారు. ఏలేశ్వ రంలోని ప్రధాన రహదారిపై వారు సత్యప్రభకు వ్యతిరేకంగా ప్లేకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబోస్‌ మాట్లాడుతూ ఎప్పటి నుంచో పార్టీకి బద్ధులమై పనిచేస్తున్నామని, తమకు నియోజక వర్గ ఇన్‌ఛార్జ్‌ తగిన ప్రాధాన్యత ఇవ్వకపోగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం సరికాదన్నారు. వరుపుల రాజా కష్టాల్లో ఉన్న సమయంలో ఆయనకు అండగా నిలబడ్డామని, ఆయన మృతి అనంతరం మమ్ములను కాదని ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించారు. ఏపూరి శ్రీను, సతివాడ రాజేష్‌, పైల అయ్యప్ప, ముచ్చి అప్పలరాజు, రాయుడు చిన్న, వాగు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️