1.92 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

Apr 10,2024 23:42
ప్రస్తుత దాళ్వా సీజన్లో

ప్రజాశక్తి – సామర్లకోట

ప్రస్తుత దాళ్వా సీజన్లో జిల్లావ్యాప్తంగా 1.92 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు జిల్లా వ్యవ సాయ శాఖ అధికారి విజరు కుమార్‌ చెప్పారు. బుధవారం మండలంలోని వేట్లపాలెం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ఆయన సందర్శించి ధాన్యం కొనుగోలు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫైన్‌ రకం ధాన్యంతో బయటి మార్కెట్లో ఎక్కువ ధర లభిస్తున్నందున రైతులు బయటి మార్కెట్లో విక్రయి స్తున్నారని, బొండాలు రకం సాగు చేసిన ధాన్యంకు బయటి మార్కెట్‌ కంటే రైతు భరోసా కేంద్రాల్లోని రూ.200 అదనంగా వస్తున్నందున్నారు. 17 శాతం తేమ శాతం వచ్చే విధంగా ధాన్యాన్ని రైతులు కళ్ళాల్లో ఆరబెట్టుకుంటున్నట్లు చెప్పారు. అలాగే ఆర్‌బికేలలో గోనెసంచుల లభ్యతపై ఆరా తీశారు. రైతులు దళారులు నమ్మి తక్కువ ధరకు అమ్మి మోసపోవద్దని సూచించారు. నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని సాధారణ రకం 100 కేజీలు రూ.2183, 75 కేజీలు రూ.1637, 40 కేజీలు రూ.873 , గ్రేడ్‌ ఏ రకం 100 కేజీలకు రూ.2203, 75 కేజీలు రూ.1652, 40 కేజీలు 881లకు ధాన్యాన్ని ఆర్‌బికేల్లో కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. సామర్లకోట మండలంలో 22,500 ఎకరాల్లో సాగు చేశారని ఇప్పటివరకు 1500 ఎకరాల్లో పంట కోతలు జరిగాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం నాటికి ఐదు మెట్రిక్‌ టన్నుల ధాన్యంను కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఇమ్మిడిశెట్టి సత్య, ఎఇఒ సతీష్‌, విహెచ్‌ఎ నీలిమ, తదితరులు పాల్గొన్నారు.

➡️