24 గంటల్లో పోస్టర్లు, బ్యానర్లు తొలగింపు

Mar 21,2024 23:53
జిల్లాలోని పలు ప్రభుత్వ

ప్రజాశక్తి – కాకినాడ

జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్తులపై ఉన్న రాజకీయ ప్రకటనలకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు, ఫోటోలను 24 గంటల్లో తొలగించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రభుత్వ ఆస్తుల వద్ద రాజకీయ ప్రకటనలకు సంబంధించిన 30 వేల 947 తొలగించడం జరిగిందన్నారు. ప్రయి వేట్‌ ప్రదేశాలలో ఉన్న వాల్‌ రైటింగ్లు, పోస్టర్లు, బ్యా నెర్లు, హోర్డింగ్లు, జెండాలు వంటివి మొత్తం 10 వేల 119 తొలగించడం జరిగిందన్నారు. జిల్లాలో సివిజిల్‌ యాప్‌ ద్వారా 68 ఫిర్యాదులు అందాయని, అందులో 41 ఫిర్యాదులు డిఎస్‌సి పరీక్ష వాయిదా వేయాలని వచ్చాయని తెలిపారు. వాటిని డ్రాప్‌ చేయడం జరిగిందని, మరో 13 ఫిర్యాదులు సక్రమంగా లేవని, మిగిలిన 14 ఫిర్యాదులు ఆర్‌ఒలు పరిష్కరించడం జరిగిందని తెలిపారు. అందులో 13 ఫిర్యాదులు వంద నిమిషాల లోపల పరిష్కరించామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఎన్నికలకు సంబం ధించి వివిధ రకాల అనుమతులు కొరకు 56 దర ఖాస్తులు రాగా అందులో 30 దరఖాస్తులకు అనుమ తులు మంజూ రు చేశామని చెప్పారు. 11 దరఖాస్తులు తిరస్కరిం చగా, నాలుగు ప్రోగ్రెస్‌లో ఉన్నాయని, మరో 11 పరి శీలనలో ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకునేందుకు వచ్చిన అను మతులలో డోర్‌ టు డోర్‌ కాన్వాసింగ్‌ చేసుకునేం దుకు 20 దరఖాస్తులు, వెహికల్‌ పర్మిషనుకు 13 దరఖాస్తులు, లౌడ్‌ స్పీకర్‌తో వెహికల్‌ పర్మిషనుకు ఆరు, తాత్కాలిక పార్టీ కార్యాలయ ప్రారంభించేం దుకు 4 దరఖాస్తులు, పాంప్లెట్లు పంపిణీ చేసేం దుకు 2 దరఖా స్తులు, బ్యానర్లు ప్రద ర్శించేందుకు 2 దరఖా స్తులు, వెహికల్‌ ఫర్‌ కాండిడేట్‌ అండ్‌ ఎలక్ష న్‌ ఏజెంట్‌లకు 2 దరఖాస్తులు, ఇతర కారణాలకు 7 దరఖా స్తులు రావడం జరిగిం దని వివరించారు. జిల్లాలో 23.36 లక్షల విలువైన ఐటమ్స్‌ను సీజ్‌ చేయడం జరిగిందని, అందులో రూ.24 వేల నగదు, రూ.20.39 లక్షల విలువైన మద్యం, ఇతర ఐటమ్స్‌ 2.72 లక్షల విలువైన వస్తువులను సీజ్‌ చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో పోలీస్‌ శాఖ ద్వారా రూ.3.51 లక్షలు, స్టేట్‌ గూడ్స్‌ అండ్‌ సర్విస్‌ టాక్స్‌/కమర్షియల్‌ టాక్స్‌ ద్వారా రూ.74 వేలు, ఇతర సంస్థల ద్వారా రూ.19.11 లక్షలు విలువైన వస్తువులు సీజ్‌ చేయడం జరిగిందని చెప్పారు. జిల్లాలో 324 ఆయుధాలకు అనుమతులు ఉండగా, అందులో 263 ఆయుధాలు డిపాజిట్‌ చేశారని, 61 ఎస్సెన్షియల్‌ సర్వీసులకు మినహాయిం పు ఇవ్వడం జరిగిందని వివరించారు. జిల్లాలో 23 ఎఫ్‌ఎస్‌టి టీములు పనిచేస్తున్నాయని, మూడు అంతర రాష్ట్ర, 5 అంతర జిల్లా చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. గడిచిన 24 గంటలలో జిల్లాలో ఎక్సైజ్‌, ఎస్‌ఇబి శాఖల ద్వారా 21 ఆకస్మిక తనిఖీలు నిర్వ హించి 203.7 లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్‌ చేయడం జరిగిందని, 16 కేసులు బుక్‌ చేసి 11 మందిని అరెస్టు చేయడం జరిగిందని కలెక్టర్‌ తెలిపారు.

➡️