మహిళలకు సర్టిఫికెట్లు అందజేత

Apr 15,2024 23:12
కుట్టు మిషన్‌ శిక్షణ

ప్రజాశక్తి – యు.కొత్తపల్లి

కుట్టు మిషన్‌ శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు సర్టిఫి కెట్లను అందజేశారు. సోమవారం మూలపేటలో అరబిందో కార్యా లయంలో శిక్షణ పూర్తి చేసుకున్న 25 మంది మహిళలకు సర్టిఫికెట్స్‌ను అందడం జరిగిందని అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ డైరెక్టర్స్‌ కె.నిచ్చా నంద్‌ రెడ్డి, పి శరత్‌ చంద్ర తెలిపారు సెజ్‌ ప్రాంత గ్రామాలను విద్య, వైద్యం మౌలిక సదుపాయాల కల్పనలో అనేక అభివృద్ధి కార్య క్రమాలను చేపడుతుందని తెలి పారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. దీనిలో భాగంగా మహిళల సాధికారతకు అరబిందో ఫౌండేషన్‌ మహిళలకు రెండు నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుట్టు మిషన్‌ పూర్తి చేసుకున్న మహిళలకు కెనరా బ్యాంక్‌ ధర్మారావు, డి సుధాకర్చేతుల మీదుగా సర్టిఫి కెట్లు అందజేయడం జరిగింద న్నారు. మహిళలకు కుట్టు పని, చీర పెయింటింగ్‌, డిజైనర్‌ బ్లౌజులు మొదలైన వాటిలో శిక్షణ ఇచ్చి ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటు అంది స్తుందని తెలిపారు. నైపుణ్యమైన శిక్షకులచే నాణ్యమైన శిక్షణ అందించి మహిళలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొం దించేందుకు అరబిందో ఫౌండేషన్‌ సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️