వసంత నవరాత్రి ఉత్సవం ప్రారంభం

Apr 9,2024 23:21
ఈ నెల 19వ తేదీ వరకు

ప్రజాశక్తి – సామర్లకోట

ఈ నెల 19వ తేదీ వరకు భీమేశ్వర స్వామి ఆలయంలో జరగనున్న వసంత నవరాత్రి మహోత్సవాలు మంగళవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ నంది మండపంలో తొలుత విగేశ్వర పూజ, పుణ్యాహవచనం తదితర పూజలు అనంతరం ఆల య అభిషేక్‌ పండిట్‌ వేమూరి సోమేశ్వర శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆలయ ఇఒ బల్ల నీలకంఠం ఆధ్వర్యంలో అర్చకులు చెరకూరి రాంబాబుశర్మ, సన్నిధిరాజు వెంకన్నశర్మ, సత్యనారాయణమూర్తి, వినరు శర్మ విశేష పూజలు చేశారు. ఈ పూజలో తహశీల్దార్‌ శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జె.రామారావు, పారిశ్రామిక వేత్త బిక్కిన పరమేశ్వర సాయిసత్యనారాయణ దంపతులు, బిక్కిన రాజశేఖర్‌ దంపతులు, మానవహక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ పాల్గొన్నారు.

➡️