మే డేను జయప్రదం చేయండి

Apr 22,2024 23:57
ప్రపంచ కార్మిక దినోత్సవం

ప్రజాశక్తి – పెద్దాపురం

ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే ఉత్సవంలో అన్ని కార్మిక సంఘాల కార్మికులు పా ల్గొని జయప్రదం చేయా లని సిఐటియు విజ్ఞప్తి చేసింది. సోమవారం స్థా నిక యాసలపు సూర్యారావు భవనంలో సిఐటియు మండల అధ్యక్షులు గడిగట్ల సత్తిబాబు అధ్యక్షతన జరిగిన సమా వేశంలో పలువురు మాట్లాడుతూ గతంలో అనేక పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న అనేక కార్మిక హక్కులు నేడు కాల రాయబడుతున్నాయన్నారు. ఈ తరుణంలో వీటి పరిరక్షణ కోసం అన్ని విభాగాల కార్మికులు మేడే ఉత్సవాలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంటులో ఆమోదిం చిన కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, స్కీం వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని, పరిశ్రమలలో కార్మి కులు ప్రమాదా లకు గురికాకుండా రక్షణ ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సిఐ టియు నాయకులు దాడి బేబీ, టిఎల్‌. ప ద్మావతి, ఎస్‌.స్నేహ లత, నీలపాల సూరి బాబు, సిరపరపు శ్రీనివాస్‌, చింతల సత్య నారాయణ, నీలం శ్రీను, గూనూరు వెం కటరమణ, కరణం అప్పన్న పాల్గొన్నారు.

➡️