ఫిబ్రవరి 16న దేశవ్యాప్త గ్రామీణ బంద్

Jan 27,2024 15:03 #Kakinada

కార్మిక, రైతు సంఘాల బైక్ ర్యాలీ
ఉద్యోగాలు, గిట్టుబాటు ధరచట్టం, కనీస వేతనం 26వేలకై డిమాండ్

ప్రజాశక్తి-కాకినాడ : ఆల్ ఇండియా కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతు సంఘాలు, కార్మిక సంఘాలు కాకినాడ భానుగుడి నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనం 26,000 చెల్లించాలని, ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి రోజు వేతనం 600 చెల్లించాలని, కౌలు రైతులకు భూ యజమనితో సంబంధంలేకుండా పంట రుణాలు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అధిక ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 16 దేశవ్యాప్త గ్రామీణ బంద్ లో స్వచ్చందంగా రైతులు, కార్మికులందరూ పాల్గొనడం ద్వారా మోడీ కార్పొరేట్ అనుకూల, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ఓడించేందుకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.వెంకటేశ్వర్లు, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లూరి రాజబాబు, టీఎన్టీయుసి జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబు, అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వింజమళ్ల చిట్టిబాబు మాట్లాడుతూ అధిక ధరలతో సామాన్యులు పేదరికంలో నెట్టబడుతుంటే, మోడీ మిత్రులు అదాని, అంబానీలు మాత్రం ప్రపంచ కుబేరుల స్థానానికి పోటీ పడుతున్నారని, ఆక్స్ ఫార్మ్ నివేదిక ప్రకారం జిఎస్టీ భారం సమన్యులపైనే పడిందని, జిఎస్టీ పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో అట్టడుగు ప్రజలనుండి 64శాతం అంటే 15లక్షల కోట్లు ముక్కుపిండి వసూలుచేస్తూన్నారని, 10శాతంగా ఉన్న ధనవంతులైన కార్పొరేట్ల నుండి 3శాతం జిఎస్టీ మాత్రమే వసులు చేస్తు కార్పొరేట్లకు మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న 18 లక్షల పోస్టులను భర్తీ చేయకుండా 25ఏళ్లలోపు పట్టభద్రులలో ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగ యువతకు ఉపాధిలేకుండా మోడీ చేస్తున్నారన్నారు. ఈ పదేళ్ల కాలంలో 1లక్షా 50వేల మంది రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్యలు చేసుకున్నారని, మోడీ ప్రభుత్వం రైతాంగం సంవత్సర కాలంచేసిన పోరాటం సందర్భంగా రైతుల డిమాండ్లన్నీ అమలు చేస్తానని పంటలకు మద్దతు ధర చట్టం చేస్తానని చెప్పి రైతాంగాన్ని వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉపాధిహామీ పథకాన్ని నీరుగారుస్తూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 2022 – 23 బడ్జెట్ నుండి 33శాతం కోటవిధించిందని, అదే సమయంలో గ్రామాల్లో చదువుకున్న యువత సైతం గత్యంతరంలేక ఉపాధి పనులకు కోట్లలో దరఖాస్తు చేసుకోవడం పెరిగిందని వాపోయారు. నిరుద్యోగం, అధిక ధరలు, రైతాంగ సంక్షోభం, కార్మికుల కనీస డిమాండ్లు పరిష్కరించలేక మోడీ ప్రభుత్వం రాముడి వెనకాల దాక్కొంటున్న విషయాన్ని ప్రజలు గమనించి 2024 ఎన్నికల్లో బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కును ప్రేవేటికరిస్తున్నా, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం, నష్టపరిహారం చెల్లించే బాధ్యతనుండి మోడీ ప్రభుత్వం తప్పుకుటుంటే అధికార వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క మాట మాట్లాడకుండా మోడీ భజన చేస్తూ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తుందని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారెడ్డి, రైతులు కెవివి సత్యన్నారాయణ, కాళ్ళ నాగేశ్వరరావు, ఓరుగంటి శివ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలకా రమణ, ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్సులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబండి చంద్రవతి, చామంతి, రమణమ్మ, తెలుగుదేశం పార్టీ రైతు విభాగం నాయకులు వెంకటరమణ, ధర్మారావు, సత్తిబాబు అమలగంటి బలరాం, పెద్ద, ఎఐఎఫ్టియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి అంజిబాబు, ఐఎన్టియసి ఎపి అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లురి రాజు, గుబ్బల ఆదినారాయణ, పి.డి.ఎస్.యు కార్యదర్శి వి.మయూరి, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు కేసవరపు అప్పలరాజు, పప్పు ఆదినారాయణ, పప్పు ఆదినారాయణ, కౌలు రైతులు చల్లా సంతోష్ కుమార్, కొంబత్తుల వెంకటరమణ, దడాల అబ్బులు, చల్లా వెంకటరమణ, రెడ్డి శ్రీనివాసు, అడపా రాజు, ఇళ్ల మహేశ్వరరావు, పాలేపు ఈశ్వరరావు, పలివెల సింహాచలం, ఐఎఫ్టియు నాయకులు భైరవస్వామి, నరసింహ, బంగారు సత్యనారాయణ, రాజ్ కుమార్, నాగేశ్వరరావు, తలుపులు, ప్రసాదు, అంబటి వెంకటేశ్వరరావు, పెద్దింశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️