మత్స్యకారులకు నష్టపరహారం చేయవలసిందే

Mar 4,2024 16:57 #Kakinada
  •  లేకుంటే పనులు జరగనివ్వం
     అఖిలపక్ష నాయకుల డిమాండ్

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో పడిన చమురు గ్యాస్ మన ఆంధ్రప్రదేశ్ కే దక్కాలని గ్యాస్ వెలికితీత కారణంగా నష్టపోతున్న మత్స్యకారులకు నష్ట పరిహారం అందించాలని కోరుతూ కాకినాడ జిల్లా అఖిలపక్ష పార్టీల బృందం సోమవారం జిల్లా కలెక్టర్ కృత్రికా శుక్లా కు కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. అనంతరం విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఓఎన్జిసి చమురు గ్యాస్ నిక్షేపాల కోసం సముద్ర గర్భంలో ప్రతిపాదించిన సీసీ మిక్ సర్వే వల్ల కాకినాడ మత్స్యకారులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఈ సర్వే జరిగే సమయంలో కాకినాడ మూడు దిక్కుల 500 చదరపు కిలోమీటర్ పరిధిలో మత్స్యకారులు వేటకు వెళ్ళనివ్వకుండా నియంత్రించాలని ఇప్పటికే ఓఎన్జిసి సంస్థ మత్స్యకారులకు లేఖ ఇచ్చిందన్నారు. సముద్రాన్నే నమ్ముకున్న మత్స్యకారులు జీవనోపాధి దెబ్బతింటుందన్నారు. ఇలాంటి సమయంలో మత్స్యకారులకు నష్ట పరిహారం అందజేయాలన్నారు. ఓఎన్టిసి ద్వారా చమురు గ్యాస్ తీసి పైప్ లైన్ ద్వారా తరలిస్తే ఆంధ్ర ప్రజలు తీవ్ర నష్టపోతారని, ప్రమాదాలు జరిగితే ఆంధ్ర ప్రజలకు నష్టం అని లాభాలు మాత్రం బడా కార్ప్ రేట్ లకా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకార కుటుంబాలకు న్యాయం చేయకపోయినా, ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన వాటా దక్కక పోయినా ఒక్క పైపులైను పనులు ప్రారంభం కాకుండా అఖిలపక్ష అధ్వర్యంలో అడ్డుకుంటామని మధు అన్నారు. టిడిపి నగర అధ్యక్షులు వీరేంద్ర, తుమ్మలపల్లి బాబు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లిపూడి రామచంద్రమూర్తి, జనసేన నాయకులు సుంకర సురేష్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కృష్ణమోహన్, ఆర్బిఐ జాతీయ కార్యదర్శి పిట్ట వరప్రసాద్, సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ మాట్లాడుతూ కేజీ బేసిన్ చమురులో 12వ ఆర్థిక సంఘం సిఫార్సు వరకు 50 శాతం వాటా ఇవ్వాలని కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో గ్యాస్ వెలికి తీత కారణంగా వేట నిషేధానికి గురై నష్టపోతున్న మత్స్యకారులకు నష్టపరిహారం అందించి ఉపాధి కల్పించాలని కాకినాడ ప్రజలకు అతి తక్కువ ధరకు ఇంటింటా గ్యాస్ సరఫరా చేయాలన్నారు. కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భం నుండి 2024 జనవరి 7 న ముడి చమురు ఉత్పత్తి ప్రారంభమైందని ఈ విలువ సుమారు కొన్ని లక్షల కోట్లు మించి ఉంటుందన్నారు. ఈ చమురు నిక్షేపాలు రాష్ట్రానికి 50 శాతం వాటా ఇస్తే రాష్ట్రం సర్వముకాభివృద్ధిగా మారుతుందని ముఖ్యంగా కాకినాడ జిల్లా రూపురేఖలు మారిపోతాయని అదే విధంగా లీటర్ పెట్రోల్ పది రూపాయలు, గ్యాస్ సిలిండర్ వంద రూపాయలకే ఇవ్వచ్చని ఇంటింటికి గ్యాస్ సరపరా చేయవచ్చని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మత్స్యకార సంఘం జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్, పిసిసి మెంబర్ ఆకుల వెంకటరమణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు, తాళ్లూరి రాజు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ పెద్దిరెడ్ల సత్యనారాయణ, పిఎస్. నారాయణ, టిఎన్ టియుసి నాయకులు గదులు సాయిబాబా, ఏటిమొగమత్స్యకార నాయకులు అద్దటి శివ, వలమాటి పెద్ద ధర్మారావు, సంగడి వీరబాబు, ఈ కార్యక్రమానికి పౌరు సంక్షేమ సంఘం కన్వీనర్ దుసర్లపూడి రమణ రాజు సంఘీభావం తెలియజేశారు.

➡️