ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి

Apr 5,2024 16:21 #Kakinada

ప్రజాశక్తి-సామర్లకోట : స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త , భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్‌ జీవితం స్ఫూర్తి దాయకమని పెద్దాపురం నియోజక వర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి దవులూరి దొరబాబు అన్నారు. దళిత వర్గాల అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్‌ 116వ జయంతి వేడుకలు మున్సిపల్ వైస్ చైర్మన్ ఉబా జాన్ మోజెస్ ఆధ్వర్యంలో శుక్రవారం సామర్లకోట 6వ వార్డులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ విగ్రహానికి దవులూరి దొరబాబు, మున్సిపల్ చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణ, వైస్ చైర్మన్ గోకిన సునెత్ర దేవి, కార్మిక సంఘ నాయకులు దవులూరి సుబ్బారావు, గొరకపూడి చిన్నయ్య దొర లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పలువురు ముఖ్య అదితులు, మాదిగ సంఘ నాయకులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు ఆవాల లక్ష్మి నారాయణ, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ నాయకులు మడికి మేరీ సోనియా,మైలా బత్తుల జానీ మొజేస్, సల్లూరి కళ్యాణ్, కాళ్ల లక్ష్మి నారాయణ, వల్లూరి నాని, జనార్దన్, కాతేటి అరుణ్ కుమార్, వారా సుధాకర్, లింగం శివ ప్రసాద్, మద్దాల శ్రీను, పులిమెరు ప్రకాశ్, కాపవరపు కుమార్, పాలికి కుసుమ చంటి బాబు, నేతల హరిబాబు, బీపెల్లి పండు, తదితర బాబూ జగ్జీవన్‌ రామ్‌ యువజన సంఘ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పెద్ద ఎత్తున విందు భోజనాలు ఏర్పాటు చేయగా దొరబాబు చేతులు మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

వేట్లపాలెంలో నూతన విగ్రహ ఆవిష్కరణ
కాగా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత మాజీ ఉప ప్రధాని, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని పెద్దాపురం తెలుగుదేశం నాయకులు గుణ్ణం చంద్రమౌళి తనయుడు గుణ్ణం రిత్విక్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

➡️