నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలి

Apr 5,2024 23:10
యువత తమలోని

ప్రజాశక్తి – కాకినాడ

యువత తమలోని నైపుణ్యాలను మెరుగు పరుచుకుని ఉన్నత శిఖరాలకు చేరేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ జె.నివాస్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సూర్య కళా మందిరంలో సంజీవ్‌ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులను అందరిని సమకూర్చి, సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినంద నీయమన్నారు. యువత తమలోని నైపుణ్యాలను మెరుగు పరుచుకుని ఉన్నత స్థాయికి చేరేందుకు కృషి చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో యువత భాగ స్వామ్యం, ఓటు హక్కు వినియోగం ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపుష్టికి, బలోపేతానికి ఎంతో అవసర మన్నారు. తొలి రోజుల్లో చాలా దేశాల్లో చదువు కున్నవారికి మాత్రమే ఓటు హక్కు కల్పించేవారని, మన భారతదేశంలో మాత్రం 18 సంవత్సరాలు నుంచి ప్రతి ఒక్కరికి ఓటు వేసే హక్కు కల్పించడం జరిగిందన్నారు. ఇదే మన భారత రాజ్యాంగం యొక్క విశిష్టతన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవ్‌ కళాశాల ప్రతినిధులు ఆనంద రాయుడు, పి.రామ సంజీవ్‌, సి.రామ్‌ప్రసాద్‌, కాకినాడ అర్బన్‌ తహశీల్దార్‌ కె.చెల్లన్నదొర, స్వీప్‌ నోడల్‌ అధికారి పి.విజరు భాస్కర్‌ పాల్గొన్నారు.

➡️