అవగాహనతోనే సక్రమంగా నిర్వహించగలం

Apr 13,2024 22:06
ఎన్నికల అధికారులు,

ప్రజాశక్తి – తుని, ప్రత్తిపాడు, పెద్దాపురం

ఎన్నికల అధికారులు, సిబ్బంది ఎన్నికల పట్ల సంపూర్ణ అవగాహన ఉండటం ద్వారానే ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించగలమని కలెక్టర్‌ జె.నివాస్‌ అన్నారు. శనివారం ఆయన తుని, ప్రత్తిపాడు, పెద్దాపురం నియోజకవర్గాల్లో నిర్వహిం చిన ఎన్నికల సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను పరిశీలించారు. అనంతరం ఆయా డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లను పరిశీలించారు. తుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రి బ్యూషన్‌ సెంటర్‌ను పరిశీలించారు. అదేవిధంగా ప్రత్తిపాడు నియోజక వర్గానికి సంబంధించి ప్రత్తి పాడు జడ్‌పి ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ సిబ్బంది శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్దాపురంలో మహారాణి కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను, ఇవిఎంల స్టోరేజ్‌ రూమును, ఇతర వసతులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నివాస్‌ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పట్ల పిఒలు, ఇతర సిబ్బంది సంపూర్ణ అవగాహనతో ఉండాలన్నారు. పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం ముందు నిర్వహించే మాక్‌ పోల్‌ అత్యంత కీలకమని పోలింగ్‌ సిబ్బందికి వివరించారు. ఇవిఎం, వివి ప్యాడ్‌ పనితీరు, పిఒ డైరీ, ఇతర డాక్యుమెంట్స్‌ పూర్తి చేయుటంలో ఎటువంటి తప్పులకు తావు లేకుండా అప్రమత్తతతో వ్యవహరిం చాలన్నా రు. డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల వద్ద పోలింగ్‌ సిబ్బంది ఇటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తుని రిటర్నిం గ్‌ అధికారి కెవి.రామలక్ష్మి, ప్రత్తిపాడు రిటర్నింగ్‌ అధికారి ఎ.శ్రీనివాసరావు, పెద్దాపురం రిటర్నింగ్‌ అధికారి జె.సీతారామరావు, ఇతర ఎన్నికల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

➡️