జోరుగా కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రచారం

Apr 30,2024 23:21
మండలంలోని గుర్రప్పాలెం,

ప్రజాశక్తి – జగ్గంపేట

మండలంలోని గుర్రప్పాలెం, గొల్లలగుంట గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ అభ్యర్థి మరోతి శివ గణేష్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన హామీలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా గణేష్‌ మాట్లాడుతూ రెండు లక్షల రైతు రుణమాఫీ, ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం రూ.400, ఐదు లక్షలతో పేదలకు గృహ నిర్మాణం, వృద్ధులకు పెన్షన్‌ రూ.4000, వికలాంగులకు రూ.6000 మరియు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీని ప్రజలందరూ ఆదరించాలని, కాంగ్రెస్‌ పార్టీతోనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని అన్నారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి మంగపతి పల్లంరాజుకి, జగ్గంపేట అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు హస్తం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు ముద్రను వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు శ్రీ వత్సవాయి సత్యనారాయణరాజు, డాక్టర్‌ నక్క సత్యనారాయణ, చంద్రమౌళి వెంకట రత్నం, కాటే జయ, అధిక సంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️