తాళ్లరేవులో మండల పార్టీ కార్యాలయం ప్రారంభం

Mar 14,2024 10:30 #Kakinada

ప్రజాశక్తి-తాళ్లరేవు: రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాళ్ళరేవు సంతపేట సెంటర్లో సామా వారి స్థలంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వై కా పా మండల పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యకర్తలకు, నాయకులకు పార్టీ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి స్థానికంగా కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి దొమ్మేటి సాగర్, మండల పార్టీ అధ్యక్షులు కాదా గోవింద కుమార్, సామా ప్రకాష్, మండల ప్రధాన కార్యదర్శి బొంతుమోహన్, ఆకుల వెంకన్న, చిట్టూరి చలపతి, విత్తనాల పండు, ధూళిపూడి నాగేంద్రప్రసాద్, కొపనాతి నాగరాజు, భూసారపు పద్మారావు, కాశి లక్ష్మణస్వామి, రేవు మల్లీశ్వరి, కామాడి మాతరాజు, పోతాబత్తుల నూకరాజు,పిల్లి పరదేశ్వర రావు, బొంతు శ్రీను,పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️