ప్రత్తిపాడులో రక్షణ బలగాల కవాతు

Mar 9,2024 16:07 #Kakinada

ప్రజాశక్తి-ఏలేశ్వరం: రానున్న ఎన్నికల నేపథ్యంలో కేంద్ర రక్షణ బలగాలు సాయుధ పోలీసులు ప్రత్తిపాడు ఒమ్మంగి చింతలూరు గ్రామాల్లో కవాతు నిర్వహించి ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ప్రతిపాడు సీఐ ఎం శేఖర్ బాబు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలు ప్రశాంతంగా, సజావుగా ఎన్నికల్లో పాల్గొనేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన కేంద్ర రక్షణ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామన్నారు. అనంతరం చింతలూరులో జరిగిన ఎన్నికల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ కేంద్ర రక్షణ బలగాలైన సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ బృందాలను సమస్యాత్మకు గ్రామాలలో మోహరిస్తామన్నారు. ప్రజలందరూ ఎన్నికలు శాంతియుత వాతావరణం లో జరిగేలా సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు, ఏలేశ్వరం, అన్నవరం ఎస్ ఐ లు ఎం పవన్ కుమార్, జి సతీష్, వి కిషోర్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.

➡️