రాజులోవ మృతి పార్టీకి తీరని లోటు

May 26,2024 23:02
రాజులోవ మృతి

ప్రజాశక్తి – రౌతులపూడి

రాజులోవ మృతి పార్టీకి తీరని లోటు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజులోవ శనివారం మృతి చెందిన విషయం విదితమే. ఆయన అంత్యక్రియలు రౌతులపూడి మండలం ములగపూడిలో ఆదివారం జరిగాయి. ఈ అంత్యక్రియలకు ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. అనంతరం సిపిఎం కాకినాడ జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌ అధ్యక్షతన సంతాప సభను నిర్వహించారు. ఈ సభలో ఉమామహేశ్వరరావు మాట్లాడారు. విద్యార్థి దశ నుంచి ఎస్‌ఎఫ్‌ఐ పట్ల ఆకర్షితులై అంచెలంచెలుగా ఎదిగి పార్టీకి సేవలు అందించారన్నారు. రాజులోవ మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి అరుణ్‌ మాట్లాడుతూ తన కుటుంబం కన్నా పార్టీ, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేశాడన్నారు. విద్యార్థి సంఘం నాయకునిగా, యువజన సంఘం, పౌర సంక్షేమ సంఘం నాయకునిగానూ సేవలు అందించారన్నారు. ఆయన మరణం పార్టీకి, కుటుంబానికి తీవ్ర నష్టమని తెలిపారు. సిఐటియు అఖిలభారత ఉపాధ్యక్షులు జి.బేబిరాణి మాట్లాడుతూ సమస్యలపై తక్షణం స్పందించే నాయకుడు రాజులోవ అన్నారు. చిన్నవయస్సులోనే మరణించడం బాధాకరమన్నారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు వై.రాము మాట్లాడుతూ డివైఎఫ్‌ఐ యువజన సంఘం నాయకునిగా రాజులోవ పలు పోరాటాలు చేశారన్నారు. నిరుద్యోగం, డిఎస్‌సిలపై చేసిన పోరాటాల్లో భాగస్వామి అయ్యారన్నారు. విజయవాడ ఎంబివికె బాధ్యులు టి.క్రాంతి మాట్లాడుతూ విద్యార్థి సంఘం నాయకునిగా ఉన్నప్పటి నుంచి రాజులోవతో పరిచయం ఉందన్నారు. చిన్నవయస్సులోనే కార్మిక సంఘం నాయకునిగా ఎదిగాడన్నారు. నిబద్ధదతో పనిచేశాడన్నారు. ఆయన మృతి బాధాకరమన్నారు. సిఐటియు ఏలూరు జిల్లా కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌ మాట్లాడుతూ కార్మిక సంఘం నాయకునిగా రాజులోవ పలు పోరాటాల్లో భాగస్వాములు అయ్యారన్నారు. కార్మికులకు ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు రాజులోవ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు. రాజులోవ చిన్నాన్న రాజుబాబు మాట్లాడుతూ 20 ఏళ్లగా రాజులోవ ఉద్యమంలో ఉన్నాడన్నారు. కుటుంబం కంటే ఉద్యమానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడన్నారు. వందలాది మందితో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నాడు. నేడు వందలాది మంది నాయకులు, కార్మికులు మధ్య అమరుడయ్యాడని కంటతడిపెట్టుకున్నారు. ఈ అంత్యక్రయిల్లో సిఐటియు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు సుందర్‌బాబు, జిల్లా సీనియర్‌ నాయకులు ఎస్‌ఎస్‌.మూర్తి, సిపిఎం రాజమహేంద్రవరం నగర కార్యదర్శి బి.పవన్‌, సిపిఎం సామర్లకోట మండల కార్యదర్శి కరణం ప్రసాద్‌. అంగన్‌వాడీ టీచర్స్‌, అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి వై.బేబిరాణి, కోనసీమ జిల్లా కార్యదర్శి కృష్ణవేణి, సిఐటియు నాయకులు ఎస్‌కె.పద్మ, ఐద్వా నాయకులు పి.తులసి, పి.స్రవంతి, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కె.పొసమ్మ, అన్నామణి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎన్‌.రాజా, వి.రాంబాబు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గంగ సూరిబాబు, వరహాలు, ప్రజాసంఘాల నాయకులు పి.మురళీకృష్ణ, వెంకటేశ్వరరావు, రాము, కె.రామకృష్ణ, సిపిఎం, ప్రజా సంఘాలు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.

➡️