క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు నష్టదాయకం

Apr 13,2024 22:08
క్షణికావేశంలో తీసుకునే నిర్ణ

ప్రజాశక్తి – గండేపల్లి

క్షణికావేశంలో తీసుకునే నిర్ణ యాలు నష్టదాయకమని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ కాకినాడ జిల్లా శాఖ ప్రతినిధి, జాతీయ పర్యావరణ మిత్ర తోటకూర గంగాధర్‌ అన్నారు. శనివారం సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీ గ్రంథాలయ విభాగంలో స్పందన ఈదా ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో విలువైన జీవితాన్ని ఆవేశంతో అనాలోచితంగా ముగిం పు పలకటం పిరికితనమేనని అన్నారు. విద్యార్థులు తమ బంగారు భవిష్యత్‌ను తల్లిదండ్రులు పిల్లలపై పెంచుకున్న ఆశలు అడియాశలు అవుతాయని అన్నా రు. సమాజంలో ఎందరో మనకన్నా హీనస్థితిలో దుర్భర పరిస్థితుల్లో కష్టాలకు ఎదురీదుతూ జీవిస్తున్నారని గుర్తుంచుకోవాలన్నారు. చిన్నపాటి సమస్యకు విలువైన జీవితాన్ని ముగించడం, పరీక్షలలో తప్పినంత మాత్రానా ఆత్మహత్యలకు పాల్పడటం మంచిది కాదన్నారు. విద్యా ర్థులు మనోధైర్యంతో ముందుకు సాగాలని అన్నారు. గ్రంథాలయ విభాగం అధిపతి కె.అశోక్‌ కుమార్‌ మాట్లా డుతూ పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక ధైర్యా న్ని కోల్పోకుండా ముందుకు సాగాలని సూచించారు.

➡️