బస్‌కాంప్లెక్స్‌ బురదమయం

May 19,2024 22:43
జగ్గంపేటలో ఉన్న ఆర్‌టిసి కాంప్లెక్స్‌

ప్రజాశక్తి – జగ్గంపేట

జగ్గంపేటలో ఉన్న ఆర్‌టిసి కాంప్లెక్స్‌ బురదమయంలో దర్శనమిస్తుంది. ఈ బస్‌స్టేషన్‌ నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే బస్‌స్టేషన్‌ ఇన్‌, అవుట్‌ గేట్‌ల వద్ద గుంతలు ఏర్పడటంతో వర్షపునీటితోపాటు, మురుగు నీరు నిలిచిపోతుంది. దీంతో ఆ గుంతలను దాటుకుని లోపలకు, బయటకు వెళ్లేందుకు ప్రయాణికులు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా సమాచార కేంద్రం వెనుక ప్రయాణీకులు కాంప్లెక్స్‌ లోపలకి వెళ్లే మార్గం సైతం బురదతో స్వాగతం పలికుతోంది. దీంతో ప్రయాణికులు ఆ మార్గంలో వెళ్లలేక చుట్టు తిరిగి లోపలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే గుంతలను పూడ్చడంతోపాటు, నీటి మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

➡️