వివేకానంద బ్రాంచ్‌ టు ప్రారంభం

Apr 29,2024 23:10
మండలంలోని శ్రీరంగనాయకపురం

ప్రజాశక్తి – తాళ్లరేవు

మండలంలోని శ్రీరంగనాయకపురం గ్రామంలో శ్రీరంగ విద్యాలయ స్థానంలో చొల్లంగి వివేకానంద పబ్లిక్‌ స్కూల్‌ బ్రాంచ్‌ టు పాఠశాలను విద్యాసంస్థల ఛైర్మన్‌ కందిళ్ల గంగబాబు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా చొల్లంగిలో ఎల్‌కెజి నుంచి 10వ తరగతి వరకు ఉన్నత ప్రమాణాలతో పాఠశాల నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ బ్రాంచ్‌ టు లో సిబిఎస్‌ఇ సిలబస్‌లో బోధన చేయనున్నట్లు వెల్లడించారు. వివేకానంద హైస్కూల్‌ ప్రిన్సిపల్‌ అండ్‌ కరస్పాండెంట్‌ మొండి భీమశంకర్‌ మాట్లాడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్‌ కుడుపూడి శివన్నారాయణ, వేగేశ్న భాస్కరరాజు, కట్ట ఆదినారాయణ, పాఠశాల హెచ్‌ఎం ఎం.సూర్యప్రకాష్‌, చొల్లంగిపేట సర్పంచ్‌ కందిళ్ల గంగాభవాని, ప్రయివేటు పాఠశాలల అసోసియేషన్‌ నాయకులు పాల్గొన్నారు.

➡️