బిజెపిని తరిమికొట్టండి

 పల్నాడు జిల్లా: ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి, కార్పొ రేట్‌ ల కోసం పనిచేస్తున్న బిజెపిని దేశం నుంచి తరిమికొట్టాలని రానున్న సార ్వ త్రిక ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్య ర్థులను గెలిపించాలని కాంగ్రెస్‌ అభ్యర్థులు జి.అలెగ్జాండర్‌ సుధాకర్‌, మహబూబ్‌ బాషా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం నరసరావుపేట మండలంలోని రావిపాడు లో ఇండియావేదిక అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అలెగ్జాండర్‌ సుధాకర్‌, మహబూబ్‌ బాషా మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని అన్నారు. సిపిఎం నరసరావుపేట పట్టణ కార్యదర్శి షేక్‌ సిలార్‌ మసూద్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 6 గ్యారం టీలను అమలు చేస్తామంటూ మేని ఫెస్టోను వివరించారు. కార్యక్రమంలో సిపిఎం సిపిఐ కాంగ్రెస్‌ నాయకులు కార్య కర్తలు పాల్గొన్నారు.

➡️