అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి

Mar 4,2024 23:09
అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి

ప్రజాశక్తి -మామిడికుదురుటిడిపి, జనసేన అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని టిడిపి పార్లమెంటరీ ఇన్‌ఛార్జి జి.హరీష్‌ మాధుర్‌ అన్నారు. గోగన్నమఠంలో తెలుగు రైతు ఉపాధ్యక్షుడు సాగి పాపయ్య రాజు ఇంటి వద్ద పార్టీ మండల అధ్యక్షుడు మొల్లేటి శ్రీనివాస్‌ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశంలో హరీష్‌ మాధుర్‌ మాట్లాడారు. నియోజకవర్గంలో టిడిపికి నిజమైన నాయకులు, కార్యకర్తలు ఉన్నారని, అందరి భాద్యత తాను తీసుకుంటానని చెప్పారు. మంగళగిరిలో నిర్వహిస్తున్న జయహో బిసి డిక్లరేషన్‌ కార్యక్రమానికి రాజోలు నుంచి భారీగా బిసిలు పాల్గొని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుబ్బల శ్రీనివాస్‌, అడబాల యుగంధర్‌, ఎంపిపి కేతా శ్రీనివాస్‌, సాగి పాపయ్య రాజు, సాగి సత్యనారాయణ రాజు, భూపతిరాజు బొజ్జియ్య రాజు, భూపతిరాజు రంగరాజు, చాగంటి స్వామి, రాపాక నవరత్నం, వర్ధినీడి బాబ్జి, రుద్రరాజు వెంకటరామరాజు, అడబాల సాయి, మోకా పార్వతి, లంకే శ్రీనివాస్‌, కడలి కృష్ణమోహన్‌, అప్పారి వెంకటేశ్వరావు, ఉండ్రు శ్రీరామరావు పాల్గొన్నారు.

➡️