ఎఎంసి డైరెక్టర్‌ శ్రీను మృతి తీరని లోటు

Mar 10,2024 17:18

శ్రీను మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న ఎంఎల్‌ఎ జగ్గిరెడ్డి

ప్రజాశక్తి-ఆలమూరు

మండల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌, పెనికేరు వైసిపి నేత చవ్వాకుల శ్రీనివాస్‌ మృతి తీరని లోటని ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. శ్రీను ఆదివారం ఉదయం తన నివాసంలో కరెంట్‌ షాక్‌కు గురై మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎంఎల్‌ఎ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీను మృతదేహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీను పార్టీలో చాలా క్రియా శీలకంగా పనిచేసేవారని, ఆయన సేవలను గుర్తుచేసు కున్నారు. శ్రీను మృతిపట్ల కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామన్నారు. అలాగే ఆకుటుం బానికి తక్షణ సాయంగా రూ.50 వేలు అంద జేశారు. ఆయన వెంట వైసిపి మండల కన్వీ నర్‌ తమ్మన శ్రీనివాస్‌, సర్పంచ్‌ వనుం చిన్నా వతి జార్జి బాబు, తదితర నేతలు ఉన్నారు.

 

➡️