ఎన్నికల నిర్వహణపై సమీక్ష

Apr 2,2024 22:18

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎస్‌పి శ్రీధర్‌

ప్రజాశక్తి-అమలాపురం

ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎస్‌పి ఎస్‌.శ్రీధర్‌ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం నందు గల కాన్ఫరెన్స్‌ హాల్లో జిల్లా పోలీస్‌, డిఎస్‌పి స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఖచ్చితముగా పాటించాలని ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిం చేందుకు సమర్ధవంతంగా, నిష్పక్షపా తముగా, నిబద్దతతో విధులు నిర్వర్తించేందుకు సన్నద్ధంగా ఉండాలి అని అధికారులకు సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ నుంచి పోలింగ్‌ వరకు చేపట్టాల్సిన రోజు వారి విధులపై చెక్‌ లిస్ట్‌ తయారుచేసి, ఆ చెక్‌ లిస్టు ప్రకారం కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని, అందుకనుగుణంగా విధులు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. అంతర్‌ జిల్లాల సరిహద్దు ప్రాంతాల చెక్‌ పోస్ట్‌ బలోపేతంకు సమన్వయం అవసరమన్నారు. జిల్లాలో 6 జిల్లా చెక్‌ పోస్టులు, ఒక అంతరాష్ట్ర చెక్‌ పోస్ట్‌ నందు సీజర్స్‌ ముఖ్యమన్నారు. చెక్‌ పోస్టులలో సిబ్బంది 24 గంటలు వాహనాలు తనిఖీ చేస్తూ తరలించే మద్యం, నగదును సీజ్‌ చేయాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన బ్యారికేడింగ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేలా రెవెన్యూ అధికారులతో కలసి సమన్వయముతో పని చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్‌పి ఎస్‌.ఖాదర్‌ బాషా, డిఎస్‌పిలు మహేశ్వర రావు, రామ కష్ణ, రమణ, గోవింద రావు, ట్రయినీ డీఎస్పీ విష్ణు స్వరూప్‌, ఎఆర్‌డిఎస్‌పి విజయ సారధి తదితరులు పాల్గొన్నారు.

 

➡️