క్రమశిక్షణతో విద్యనభ్యసించాలి

Mar 15,2024 22:20

విద్యార్థులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ శ్రీను నాయక్‌

ప్రజాశక్తి-ఆలమూరు

విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎస్‌ఐ ఎల్‌.శ్రీనునాయక్‌ అన్నారు. మండలంలోని కొత్తూరు సెంటర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు శుక్రవారం అవగాహనా సదస్సు ఆయన నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ఇంట్లో తల్లిదండ్రులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు చెప్పే ప్రతి విషయాలను గమనించి ముందుకు సాగాలన్నారు. ఉన్నత విద్యలో రాణించి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. ముఖ్యంగా చట్టాలపై అవగాహన కల్పించారు. అలాగే వాహనాలపై పాఠశాల చుట్టూ తిరుగుతూ బాలికల పట్ల ర్యాగింగ్‌కి పాల్పడినవారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ ఛైర్మన్‌ గంటా శ్రీనివాస్‌ (ల్యాబ్‌ శీను), పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

 

➡️