టెన్త్‌ విద్యార్థులకు పరీక్ష కిట్ల అందజేత

Mar 3,2024 18:28

పరీక్ష కిట్లు అందిస్తున్న ఎస్‌సి,ఎస్‌టి సంక్షేమ సంఘం

ప్రజాశక్తి-అంబాజీపేట

గంగలకుర్రు హస్టల్‌ లో పదవ తరగతి విద్యార్థులకు అంబాజీపేట ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ సంఘం సభ్యులు ఆదివారం పరీక్షలకు అవసరమయ్యే జామెంటరీ బాక్స్‌, ప్లాంక్స్‌, పెన్ను, పెన్సిల్‌, స్కేల్‌, తదితర వస్తువులు అందజేశారు. పరీక్షలు బాగా రాసి ప్రథమ శ్రేణిలో ఉత్తమ స్థాయిలో మార్కులు సాధించాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కోనసీమ ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ సంఘం వి.సత్యనారాయణ, టి.రామకుమారి, హాస్టల్‌ వార్డెన్‌ బి.ఎమ్‌.వి. సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

 

➡️