తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి

Feb 25,2024 23:20
తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి

ప్రజాశక్తి-పి.గన్నవరం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని తెలంగాణ మాజీ సిఎం కెసిఆర్‌ కుమార్తె ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అన్నారు. ముంగండ గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి నూతన ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ఆదివారం ఆమె పాల్గొనానరు. మాజీ ఎంపిపి అంబటి భూలక్ష్మి కోటేశ్వరరావు, ఆలయ నిర్వాహక కమిటీ ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనతంర కవిత మాట్లాడుతూ బ్రిటిష్‌ వారి ముందు తలవంచకుండా ఆంధ్ర పౌరుషాన్ని చాటిచెప్పిన దశాబ్ధాల చరిత్ర గల గ్రామం ముంగండ అన్నారు. ఎపి రవాణాశాఖ మంత్రి విశ్వరూప్‌, జెడ్‌పి చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, మానేపల్లి అయ్యాజీ వేమా, ఎంపిపి గనిశెట్టి నాగలక్ష్మి, సర్పంచ్‌ కుసుమ చంద్రకళ వెంకటేశ్వరరావు, పి.గన్నవరం సర్పంచ్‌ బొండాడ నాగమణి తదితరులు పాల్గొన్నారు.

➡️