రెండు గ్రామాల్లో పోలీసు కవాతు

Mar 29,2024 23:31

నేలటూరులో పోలీస్‌ కవాతు

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం

మండలంలోని నేలటూరు, కోరుమిల్లి గ్రామాల్లో శుక్రవారం మండపేట రూరల్‌ సిఐ శ్రీధర్‌, అంగర ఎస్‌ఐ అందే పరదేశి ఆధ్వర్యంలో పోలీస్‌ కవాతు నిర్వహించారు. పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామాల్లోని మెయిన్‌ రోడ్డుల్లో సెంట్రల్‌ ఇండిస్టియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సిఐఎస్‌ఎఫ్‌), స్థానిక పోలీసులుతో కలిసి కవాతు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో సజావుగా జరగాలని, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

 

➡️