విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే

Feb 1,2024 23:12

నాగేశ్వరరావు దంపతులను సత్కరిస్తున్న గ్రామస్తులు

ప్రజాశక్తి-ఉప్పలగుప్తం

విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని జెడ్‌పిటిసి సభ్యుడు గెడ్డం సంపదరావు అన్నారు. ఉప్పలగుప్తం పంచాయతీ కామరాజుపేట ఎంపిపి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కడలి నాగేశ్వరరావు ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆ పాఠశాలలో నాగేశ్వరరావు, వెంకట సత్య భానుమతి దంపతులను జెడ్‌పిటిసి సభ్యులు సంపదరావు, ఎంపిటిసి సభ్యులు తాళ్ల లక్ష్మీనరసాయమ్మ, వంగా గిరిజ కుమారి, గ్రామస్తులు ఉపాధ్యాయులు దుశ్శాలువాలు కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో పిఎంసి ఛైర్మన్‌ తాళ్ల శ్రీనివాసరావు, యుటిఎఫ్‌, ఎస్‌ టి యు నాయకులు ఎ.సురేష్‌, చిక్కం మైనర్‌బాబు, ఎన్‌.రుషేంద్రకుమార్‌, గ్రామస్తులు దోనిపాటి శ్రీనివాసరావు, జనిపెల్ల శివాజీ దితరులు పాల్గొన్నారు.

 

➡️