స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

Mar 8,2024 17:44

మండపేట పట్టణంలో కవాతు చేస్తున్న పోలీసులు

ప్రజాశక్తి-మండపేట

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రజలకు భరోసా కల్పించేందుకే కవాతును నిర్వహిస్తున్నట్లు మండపేట టౌన్‌ ఎస్‌ఐ శాస్త్రి తెలియజేశారు. శుక్రవారం ఆయన తన సిబ్బంది, కేంద్ర సాయుధ బలగాలతో కలసి కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఎస్‌ఐ చిన్నారావు, రాము తదితరులు పాల్గొన్నారు.

 

➡️