4వ విడత వైయస్సార్ ఆసరా సంబరాలపై సమీక్ష

Jan 22,2024 16:23 #Konaseema
4th asara program

ప్రజాశక్తి – ఆలమూరు : మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు అధ్యక్షతన ఎంపీడీవో కె.జాన్ లింకన్ ఆధ్వర్యంలో ” నాలుగో విడత వైయస్సార్ ఆసరాకు సంబంధించి సంబరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 23న కొత్తూరు సెంటర్ ఎస్ జె ఆర్ ఫంక్షన్ హాల్ లో జరగనున్న మండల పరిధి పెద్దపల్ల, పినపల్ల, సందిపూడి, చింతలూరు, సూర్యారావుపేట, కలవచర్ల గ్రామాలకు సంబంధించి స్వయం సహాయక సంఘాలకు ఆసరా అందజేయడం జరుగుతుందన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ హాజరై కార్యక్రమం జయప్రదం చేయాలని వారు కోరారు. అలాగే మండల పరిధి 18 గ్రామాలకు గాను 4వ విడత వైయస్సార్ ఆసరా పథకం ద్వారా 1654 గ్రూపులకు, 16,540 మంది సభ్యులకు, రూ. 15.02 కోట్లు లబ్దిచేకూరనుందన్నారు. దీంతో నాలుగు విడతలు మొత్తం కలిపి రూ.60.08 కోట్లు లబ్ది చేకూరనుందన్నారు. నాలుగు విడతలకు గాను ఇప్పటికే మూడు విడతలు అందజేసినట్లు, 4వ విడత ఈనెల 23 నుండి 31 వరకు స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తూ లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే ఆయా గ్రామ మహిళ సంఘాలకు పూర్తి వివరాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్, సర్పంచ్ తమ్మన శ్రీనివాస్, ఏఎంసి చైర్మన్ యనమదల నాగేశ్వరరావు, వైసిపి నేతలు నామాల శ్రీనివాస్, పాలంగి ఉమాదేవి, ఏపీఎం ధనరాజు, వివోఏలు, తదితరులు పాల్గొన్నారు.

➡️