60 లీటర్ల నాటుసారా స్వాధీనం

Mar 25,2024 15:22 #Konaseema

ప్రజాశక్తి-మండపేట : మండలంలోని వెలగతోడు కాలవ గట్టున సారా తయారు చేసే బట్టీ పై దాడి చేసి 60 లీటర్ల నాటు సారా, గ్యాస్ సిలిండర్, సారా తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ ఎస్సై చైతన్య కుమార్ అన్నారు. పలువురు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన తన సిబ్బంది
నక్క నారాయణమూర్తి, పిల్లి సత్యకుమార్, డి రవి కిషోర్, చంద్రన్ లతో దాడి చేసి వీటిని స్వాధీనం చేసుకుని తయారీదారుడైన పాలతోడు గ్రామానికి చెందిన గుత్తుల శ్రీహరిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచగా అతనికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు.

➡️