అంగన్వాడీలపై ప్రభుత్వం దమన కాండ

Jan 22,2024 14:49 #Konaseema
anganawadi arrest chalo vijayawada konseema

కార్యకర్తలను చెల్లాచెదురుగా తరలించిన వైనం

ప్రజాశక్తి-రామచంద్రపురం : అంగన్వాడి వర్కర్లపై ప్రభుత్వం ధమన కాండ మరోసారి బయటపడింది. జీతాల కోసం 42 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడి వర్కర్లు రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు చలో విజయవాడకు తరలివెల్లగా పోలీసులు అంగన్వాడి వర్కర్లను ఆర్టీసీ బస్సుల్లో ఎక్కించి రాష్ట్రంలో పలు ప్రాంతాలకు తరలించారు. ఏలూరు మచిలీపట్నం నూజివీడు కైకలూరు వంటి ప్రాంతాలకు అంగన్వాడి వర్కర్లను తరలించినట్లు రామచంద్రపురం అంగన్వాడి వర్కర్ల నాయకులు ఎం దుర్గ, యాళ్ల దేవి తదితరులు విలేకరులకు ఫోన్ చేసి వివరించారు. తమ కనీస సౌకర్యాలు లేకుండా వివిధ ప్రాంతాలకు తరలించడం పట్ల వారంతా నిరసన వ్యక్తం చేశారు. తమ హక్కులు కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం సమ్మెను కొనసాగిస్తామని ఈ సందర్భంగా వారు వివరించారు

➡️